యానిమాల్.. దిల్ రాజుతో యాపరం అంటే ఇలా ఉంటది!


ఏదైనా ఒక మంచి బజ్ ఉన్న సినిమా మార్కెట్లోకి వస్తుంది అంటే తప్పకుండా దిల్ రాజు కన్ను దానిపై పడుతుంది. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ గా ఆయనకు అవకాశం దొరకకపోయినా కూడా ఎగ్జిబిటర్గా మాత్రం ఎంతో కొంత కాష్ చేసుకునేందుకు ఆయన డీలింగ్స్ నడుస్తూనే ఉంటాయి. అటు ఆంధ్రలో ఇటు నైజం లో కొన్ని థియేటర్లు ఆయన కనుసైగల్లో నడుస్తాయి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అయితే కొంతమంది ఇతర భాషలలోని హీరోలు తెలుగులో కూడా మార్కెట్ సంపాదించుకోవడానికి దిల్ రాజు సహాయం తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు రన్ బీర్ కపూర్ కూడా యానిమల్ సినిమా కోసం దిల్ రాజు తోనే మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమానిర్మాణం లో T సీరీస్ తో పాటు దర్శకుడు సందీప్ కూడా ఒక పార్ట్నర్ గా అయితే ఉన్నాడు.

అయితే తెలుగులో బ్రహ్మాస్త్ర సినిమాతో పర్వాలేదు అనేలా క్రేజ్ అందుకున్న రన్ బీర్ ఇప్పుడు యానిమల్ సినిమాతో మాత్రం సౌత్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ అందుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే బిజినెస్ విషయంలో మంచి పేరున్న తెలుగు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో డీల్ సెట్ చేసుకుంటే బెటర్ అని ముందుగానే దర్శక నిర్మాతలకు సూచించాడట. ఇక దిల్ రాజు తో డీల్ అంటే సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తూ ఉంటారు. 

ఇక థియేటర్స్ నెంబర్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. యానిమల్ విషయంలో థియేటర్ సమస్యలు రాకుండా ఉండాలి అంటే దిల్ రాజును సంప్రదిస్తే బెటర్ అని అందరూ డిసైడ్ అయ్యారు. ఇక దిల్ రాజు సినిమా విషయంలో పెద్దగా పెట్టుబడి పెట్టకుండా చిన్న రేటుకే సినిమా రెండు తెలుగు రాష్ట్రాల రిలీజ్ రైట్స్ కొనేసి ఆ తర్వాత కలెక్షన్ బట్టి షేర్ లో ప్రాఫిట్ ఇచ్చే విధంగా డీలైతే సెట్ చేసుకున్నారు. దిల్ రోజుకు అయితే ఈ బిజినెస్ లో పెద్దగా రిస్క్ లేదు అనిమల్ సినిమాకు అంతకంటే మంచి ఆఫర్స్ వస్తున్నప్పటికీ సినిమాను దిల్ రాజు చేతిలో పెడితేనే బెటర్ అని హీరోతోపాటు దర్శకుడు ఆలోచించాడు మరి సినిమా ఎ లాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post