చంద్రముఖి 2.. అసలు దెయ్యంతోనే స్టోరీ ట్విస్ట్?


చంద్రముఖి సెకండ్ పార్ట్ కు సంబంధించిన పోస్టర్స్ అలాగే టీజర్ చూసిన తర్వాత అసలు ఈ సినిమాను చేయడానికి రాఘవ లారెన్స్ ఎలా ఒప్పుకున్నాడు కంగనా రౌనత్ ఎందుకు ఓకే చేసింది అనేలా కామెంట్స్ అయితే వచ్చాయి. అంతేకాకుండా రజినీకాంత్ ఈ సీక్వెల్ చేయకపోవడమే మంచిది అన్నట్లుగా కూడా చాలా రకాల ట్రోలింగ్ అయితే జరిగింది.

అయితే దర్శకుడు పీ వాసు ఈసారి ఎంచుకున్న కథ అంతా నార్మల్ గా ఏమీ లేదు అని తెలుస్తోంది. కానీ అతని మేకింగ్ విధానం ఎలా ఉంటుంది అనేదానిపై సినిమా చూసే వరకు చెప్పలేము. కథ మాత్రం బలంగానే రాసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్పటి చంద్రముఖిలో రజనీకాంత్ చేసినప్పుడు అందులో జ్యోతిక పాత్రను కేవలం చంద్రముఖి ఆత్మగా ఆవహిస్తుంది. కానీ అసలు దెయ్యం రూపం మాత్రం ఉండదు.

ఆమెనే చంద్రముఖి అని ఒక పెయింటింగ్ బొమ్మను మాత్రమే చూపిస్తారు. అయితే ఈసారి చంద్రముఖి సీక్వెల్లో మాత్రం ఏకంగా అసలు దెయ్యమే తన రూపంతో పగ తీర్చుకోవడానికి వస్తుందట. ఇదే మెయిన్ ట్విస్ట్ అని తెలుస్తోంది. ఇక రాజుగా నటించిన రాఘవ లారెన్స్ పాత్ర ఏమిటి అనే విషయంలో మాత్రం సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. మరి ఆ పాత్ర ఎలా ఉంటుందో వెండితెరపై చూడాలి.

Post a Comment

Previous Post Next Post