మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి - రివ్యూ & రేటింగ్


కథ:
మాస్టర్ చెఫ్ అన్విత రవళి శెట్టి (అనుష్క) తన తల్లిని కోల్పోయిన తర్వాత UK నుంచి తిరిగి వస్తుంది. అన్విత తనకు ఒక తోడు కుటుంబం అవసరమని గ్రహిస్తుంది. కానీ వివాహ వ్యవస్థలోకి ప్రవేశించడం ఇష్టం ఉండదు. సిద్ధు పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి) స్టాండప్ కమెడియన్ ఆమెకు పరిచయం అవుతాడు. అన్విత అతనిని ఆసక్తికరంగా చూస్తుంది. ఇక సిద్ధూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుండి ఏమి ఆశిస్తున్నానో చెప్పినప్పుడు సిద్ధూ షాక్ అవుతాడు. ఇక వారి జీవితంలో తర్వాత ఏం జరుగుతుంది అనేది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అసలు కథ.

విశ్లేషణ:
స్టాండప్ కమెడియన్ పాత్రను పోషించడం ఒక గమ్మత్తైన విషయం. అనుకున్నంత ఈజీగా ఏ నటుడూ దీన్ని చేయలేడు. జోక్స్ పేలకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇక నవీన్ ఎనర్జిటిక్ టైమింగ్ కి పాత్ర సెట్టయ్యింది. పోలిశెట్టి సీన్స్ ను చాలా వరకు హైలెట్ చేశాడు. తను కనిపించే ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆకట్టుకున్నాడు. వాస్తవానికి అతనే ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు లాగాడు. నవీన్ ఎమోషనల్ సైడ్ కూడా బాగానే ఆకట్టుకున్నాడు.

ఇక అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చింది. ఆమె నటించిన విధానం బాగానే ఉంది. తన కంటే చిన్న వయసున్న యువకుడితో ఆమె చేసిన సీన్స్ ను చాలా బాగా హ్యాండిల్ చేశాడు దర్శకుడు మహేష్. ఆ విధంగా, అనుష్క తను చేసిన పాత్రకు పర్ఫెక్ట్ అనిపించింది. క్లైమాక్స్‌లో కూడా హత్తుకునే సన్నివేశాల్లో అనుష్క బాగా నటించింది. ఫస్ట్ అఫ్ మొత్తం కొన్ని కామెడీ డ్రామా సీన్స్ తో ఆహ్లాదకరంగా సినిమాను కొనసాగించిన దర్శకుడు ఆ తర్వాత మెల్లగా కథలోనే అసలైన మెలికలను హైలెట్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

 ఇక సెకండ్ హాఫ్ మొదట్లోనే హీరోకు సంబంధించిన సీన్స్ ను కూడా బాగా ఎలివేట్ చేశాడు. ఇక చివరిలో క్లైమాక్స్ సన్నివేశాలకు ఎమోషనల్ టచ్ ఇచ్చి మరింత అట్రాక్ట్ చేశాడు. అయితే కథలో మాత్రం ముందుగా ఏం జరుగుతుంది అన్న విషయంలో ఆడియన్స్ ముందే ఊహించేలా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని నీరసంగా అనిపించే సన్నివేశాలు అలాగే పాటలు ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఆ రెండు విషయాల్లో జాగ్రత్తగా తీసుకుని ఉంటే బాగుండేది.

మొత్తానికి నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ అలాగే అనుష్క ఘటన ఇక సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ మేజర్ ప్లస్ పాయింట్స్ గా ఉన్నాయి. పెద్దగా అంచనాలు లేకుండా సినిమాను చూడగలిగితే బాగా నచ్చుతుంది. ఇక సహాయ నటులు మురళీ శర్మ, అభినవ్ గోమతం, హ్యాపీ డేస్ సోనియా కీలక పాత్రలు పోషించారు. మురళీ శర్మ వేసిన కొన్ని జోకులు చాలా బాగున్నాయి. జయసుధ, హర్షవర్ధన్, నాజర్, తులసి వంటి వారు ఎప్పటిలానే కథకు అవసరమయ్యే రోల్స్ చేశారు.

ప్లస్ పాయింట్స్:
👉నవీన్ పోలిశెట్టి
👉డైలాగ్స్
👉కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్:
👉సాంగ్స్
👉సెకండాఫ్‌ లో ల్యాగ్ 

రేటింగ్: 3/5

Post a Comment

Previous Post Next Post