ఖుషి: హిట్ టాక్ వచ్చినా.. ఆ స్థాయిలో నష్టాలే?


ఖుషి మొదటి రోజు టాక్, అలాగే వచ్చిన రివ్యూలను బట్టి గమనిస్తే ఆ సినిమా తప్పకుండా బ్రేక్ ఈవెన్ సాధించి ఎంతో కొంత ప్రాఫిట్స్ అందిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆడియన్స్ ఈ సినిమా రిజల్ట్ ను ఎటూ నిర్ణయించలేకపోయారు. సినిమా బాగానే ఉన్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో అయితే సినిమా ఆకట్టుకోలేదు అనే విధంగా ఓవర్గం వారి నుంచి టాక్ అయితే వినిపించింది. 

అయితే చివరికి ఇప్పుడు కలెక్షన్స్ బట్టి చూస్తే ఈ రోజుల్లో సినిమా జస్ట్ బాగుంది అని టాక్ వస్తే సరిపోదు అని అర్ధమవుతుంది.  సినిమాకు మొదటి రోజే హిట్ టాక్ కాస్త వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద నష్టాలను చూడక తప్పడం లేదు. దానికి తోడు ఈ వారం వచ్చిన జవాన్ సినిమాతో పాటు మిస్ శెట్టి మిస్టర్ పోలీశెట్టి రెండు కూడా పాజిటివ్ టాక్ అందుకోవడంతో బాక్సాఫీస్ వద్ద ప్రభావం పడింది. ఇక మొత్తంగా థియేట్రికల్ గా పెట్టిన పెట్టుబడికి ఖుషి సినిమా అయితే దాదాపు 12 కోట్ల స్థాయిలో అయితే నష్టపోయే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post