మైత్రి - శ్రీవిష్ణు.. మరో అబ్బవరంలా చేయకండి సామీ!


మైత్రి మూవీ మేకర్స్ ప్రాజెక్టులను అనౌన్స్ చేయడంతోనే కాస్త జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. నెవర్ బిఫోర్ అనే కాంబినేషన్స్ తో పాటు కుర్ర హీరోలను కూడా మాస్ హీరోలుగా మార్చే విధంగా ఈ బ్యానర్ అడుగులు వేస్తోంది. ఆలోచన మంచిదే కానీ కథలను సెలెక్ట్ చేసుకోవడంలో నిర్మాతలు దారుణంగా విఫలమవుతున్నారు. ఇప్పుడు శ్రీ విష్ణు తో ఒక ప్రయోగం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

శ్రీ విష్ణు సామజవరగమన సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుని మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసాడు. అంతకుముందు వరుస డిజాస్టర్స్ చూసిన శ్రీ విష్ణు ఆ సినిమాతో సక్సెస్ అందుకోవడానికి కారణం అతనికి సెట్ అయ్యే విధంగా మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడం. అయితే ఇప్పుడు శ్రీ విష్ణువుతో మైత్రి మూవీ మేకర్స్ కమర్షియల్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అందులోను కాస్త సెటరికల్ యాక్షన్ ఉండేలా కథను సిద్ధం చేయిస్తున్నారట. అంతా బాగానే ఉంది కానీ ఇదివరకే మాస్ యాంగిల్ లో వెళ్లి కిరణ్ అబ్బవరంతో మీటర్ అనే సినిమాతో దారుణంగా డిజాస్టర్ అందుకున్నారు. అప్పటివరకు ఒక ట్రాక్లో వెళ్లిన కిరణ్ అనవసరంగా మాస్ యాంగిల్ లోకి వెళ్లే భారీ దెబ్బను ఎదుర్కొన్నాడు. 

మాస్ కమర్షియల్ సినిమాలు ఇలాంటి హీరోలు చేయడంలో తప్పులేదు కానీ కంటెంట్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేదంటే మీటర్ తరహాలో ఖర్చులు కూడా వెనక్కి రావు. కిరణ్ అబ్బవరం విషయంలో మైత్రి మూవీ మేకర్స్ దారుణంగా ఫెయిల్ అయింది. ఇక ఇప్పుడు శ్రీ విష్ణు కోసం అతని కెరీర్ లోనే భారీ బడ్జెట్ మాస్ యాక్షన్ సినిమాలో తీసుకువస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post