గేమ్ ఛేంజర్.. మళ్ళీ బడ్జెట్ ట్విస్ట్!


దిల్ రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ మొదట కేవలం 220 కోట్లు మాత్రమే. పక్కా ప్రణాళికతో దిల్ రాజు శంకర్ తో ఈ సినిమాను పూర్తి చేయాలని అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా బడ్జెట్ పెరుగుతూ అయితే వస్తోంది. మొదట శంకర్ ఇండియన్ 2 సినిమాను ఆపేసి ఈ సినిమాకు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 

కానీ మళ్ళీ ఇండియన్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ కావడంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ విషయంలో చాలా రకాల కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయ్యింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ 55% మాత్రమే పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇక బడ్జెట్ అయితే దాదాపు 200 కోట్ల వరకు దాటినట్లు సమాచారం. సినిమా మొదలుపెట్టిన తర్వాత తప్పకుండా 250 కోట్ల నుంచి 270 కోట్ల వరకు ఖర్చవుతుంది అని దిల్ రాజు అనుకున్నారు

కానీ శంకర్ మళ్లీ ఎప్పటిలానే బడ్జెట్ ను అమాంతంగా పెరిగిపోయేలా షూటింగ్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడు ఆ లెక్క 300 కోట్లకు పైగానే దాటినట్లుగా తెలుస్తోంది. దాదాపు 350 కోట్ల వరకు వచ్చే అవకాశం కూడా ఉందట. ఇలా జరిగితే సినిమా బిజినెస్ విషయంలో చాలా రిస్క్ అయితే ఉంటుంది. మరి దిల్ రాజు ఈ సినిమా బిజినెస్ను ఏ విధంగా చేస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post