పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమా షూటింగ్స్ లో కూడా రెగ్యులర్గా పాల్గొనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక మొత్తానికి పవన్ తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయం అయితే తీసుకున్నాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి వెళ్లాలి అనే పట్టుదలతో అయితే ఉన్నాడు.
అయితే ఈ క్రమంలో ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్స్ ఎంత వరకు ఫినిష్ చేస్తాడు అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి రెండు సినిమాలు కూడా తొందరగానే ఫినిష్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక హరిహర వీరమల్లు విషయంలో ఒక ప్లానింగ్ అయితే సెట్ కాలేదు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.
అయితే ఆ సినిమా మాత్రం ప్రత్యేకంగా ఎలక్షన్స్ కోసమే చేయబోతున్నట్లు సమాచారం. పొలిటికల్ నేపథ్యంలో ఉండబోయే ఆ సినిమా కథను వక్కంతం వంశీ అందించాడు. చాలా రకాల పొలిటికల్ అంశాలను ఆ సినిమాలో హైలెట్ చేస్తారంట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై కూడా అధికారం క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాను వచ్చే ఎన్నికల కంటే ముందే రిలీజ్ చేసే అవకాశం ఉంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో.
Follow
Follow
Post a Comment