పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమాపై అంచనాలు చిన్న లీక్స్ తోనే ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. ఇక ఇటీవల వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కూడా ఫాన్స్ కు మరింత కిక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే మార్కెట్లో మంచి డిమాండ్ కూడా పెరిగింది. డైరెక్టర్ సుజిత్ అనౌన్స్మెంట్ తోనే అందరిని ఎంతగానో అట్రాక్ట్ చేశాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ డీల్ పై చాలాకాలంగా నిర్మాత దానయ్య చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
అయితే అప్పట్లోనే ఈ సినిమాకు 18 కోట్ల ఓవర్సీస్ ఆఫర్ వచ్చింది అన్నట్లు టాక్ అయితే వినిపించింది. అయితే ఇప్పుడు ఆ లెక్క చాలా వరకు తగ్గి 13 కోట్లకు ఫిక్స్ అయిందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజమైతే లేదు. ప్రస్తుతం నిర్మాత అయితే ఇంకా ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇంకా 18 కోట్ల కంటే ఆ లెక్క పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గే అవకాశం అయితే లేదు అని తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.
Follow
Post a Comment