మెగాస్టార్ లైనప్.. 3+3 బడా దర్శక నిర్మాతలు!


మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా కొట్టిన దెబ్బ వలన ఎలాంటి తప్పు జరగకుండా ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆయన చేయబోయే సినిమాలు సక్సెస్ ట్రాక్లో ఉన్న దర్శకులతోనే అని కూడా అర్థమవుతుంది. ఇప్పటికీ కళ్యాణ్ కృష్ణ ను పక్కన పెట్టేసి వశిష్టత కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవితో ఒక కొన్ని క్రేజీ కాంబినేషన్స్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.

అల్లు అరవింద్ అయితే ఎప్పటినుంచో మెగాస్టార్ ను మరో సినిమా నిర్మించాలని చూస్తున్నాడు. ఆయన కోసం సుకుమార్ ని కూడా లైన్లో పెడుతున్నారు. ఇక త్రివిక్రమ్ దానయ్య కాంబినేషన్ లో కూడా సినిమా చేస్తానని చాలా ఏళ్ల క్రితమే మెగాస్టార్ మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట రూపం దాల్చే అవకాశం ఉంది. ఇక దిల్ రాజు కూడా మెగాస్టార్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. కమర్షియల్ యాంగిల్ లో సేఫ్ రిజల్ట్ రావాలి అంటే అనిల్ రావిపూడి కరెక్ట్ అని అతనితోనే చిరంజీవికి కథ చెప్పించడానికి ట్రై చేస్తున్నాడు. ఈ విధంగా ముగ్గురు ప్రముఖ నిర్మాతలు ముగ్గురు సక్సెస్ ట్రాక్ లో ఉన్న దర్శకులు మెగాస్టార్ లైనప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post