చిరు సినిమా ఆగిపోవడానికి కారణం చరణ్!


మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకున్న విషయం తెలిసింది. భోళా శంకర్ సినిమా తర్వాత వెంటనే ఈ ప్రాజెక్టును మొదలు పెట్టాలి. బ్రో డాడి రీమేక్ గా ను కాస్త కొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది.

మెగాస్టార్ పుట్టిన రోజున కూడా దర్శకుడు పేరు లేకుండానే పోస్టర్ను విడుదల చేశారు. ఇక ఆ ప్రాజెక్టు ఉంటుంద లేదా అనే విషయం పక్కన పెడితే అసలు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేసే అవకాశం లేదు అని తెలుస్తోంది. అతను కూడా రెగ్యులర్ కమర్షియల్ పాయింట్ లోనే మరో కథ చెప్పడంతో దానికి కూడా మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఇకనుంచి రెగ్యులర్ కమర్షియల్ దర్శకులతో అసలు చేయవద్దనే రామ్ చరణ్ చెప్పారట. అందు వల్లనే మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణను రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక వశిష్ట దర్శకత్వంలో సినిమా చేసిన తర్వాత మరొక ప్రాజెక్టు గురించి ఆలోచించాలి అని రామ్ చరణ్ తండ్రికి సూచించినట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post