సూర్య 500 కోట్ల ప్రాజెక్ట్.. పవర్ఫుల్ రోల్!


తమిళ హీరో సూర్య మెల్ల మెల్లగా తన సినిమా స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు సూర్య స్థాయిలో ఉన్న చాలా మంది కూడా పాన్ ఇండియా బిగ్ ప్రాజెక్టులను తెరపైకి తీసుకువస్తున్నారు. ఇక సూర్య కూడా కంగువ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే మరోవైపు బాలీవుడ్ లో కూడా మరో మంచి పెద్ద సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది

రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో సూర్య పవర్ఫుల్ కర్ణ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. మహావీర కర్ణ కథను సరికొత్తగా ప్రజెంట్ చేయడానికి ఓం ప్రకాష్ సిద్ధమవుతున్నారు. ఇక వచ్చే ఏడాది జూన్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం సూర్య కంగువ తో పాటు అలాగే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో రెండు ప్రాజెక్టులు అయిపోగానే కర్ణ ప్రాజెక్టును స్టార్ట్ చేయనున్నారు.

Post a Comment

Previous Post Next Post