బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ సౌత్ ఇండియాలో కూడా మంచి మార్కెట్ అందుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. బ్రహ్మాస్త్ర సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినా మంచి గుర్తింపు అయితే లభించింది. అంతేకాకుండా అతను చాలా ఓపికతో తెలుగు తమిళంలో కూడా ప్రమోషన్స్ చేశాడు. అయితే ముఖ్యంగా టాలీవుడ్ కు మాత్రం రణబీర్ చాలా దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.
యానిమల్ సినిమాను టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే రణబీర్ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలతో కూడా టచ్ లో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా దిల్ రాజుతో కూడా ఆయన ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడని లేటెస్ట్ గా ఇండస్ట్రీలో మరొక కొత్త టాక్ వైరల్ గా మారుతుంది. యానిమల్ సినిమాకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల రిలీజ్ హక్కులను దిల్ రాజు సిద్ధం చేసుకున్నారు.
ఇక ఆయనతో ముందుగానే రణబీర్ కపూర్ ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం. ఇక పాన్ ఇండియా లెవెల్లో మరో సినిమా చేసేందుకు దిల్ రాజుతో కూడా అతను ఓ మాట అనుకున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు కూడా బాలీవుడ్ పై ఫోకస్ చేయాలని ఎప్పటినుంచి ఆలోచిస్తున్నాడు. గతంలో జెర్సీ, హిట్ కథలను బాలీవుడ్ లో రీమేక్ చేసి విడుదల చేశారు. కానీ అక్కడ వర్కౌట్ కాలేదు. మరి ఈసారి రణబీర్ తో ఏం చేస్తారో చూడాలి.
Follow
Post a Comment