మరోసారి వెంకీమామ కాంబో..!


విక్టరీ వెంకటేష్, అక్కినేని హీరోగా నాగ చైతన్య మామ అల్లుళ్ళు అనే సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరిని అటు అక్కినేని అభిమానులు, ఇటు దగ్గుబాటి అభిమానులు సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ఇష్టపడతారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన వెంకీ మామ మూవీ ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. గతంలో ప్రేమమ్ చిత్రంలో వెంకటేష్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చారు. 


అలాగే వెంకటేష్, చైతూ కలిసి ఇప్పటి వరకు రెండు సినిమాలలో కలిసి నటించినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఏజెంట్ మూవీ డిజాస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం ఆఫీస్ కూడా ఓపెన్ చేశాడు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి కనీసం 8 నెలలైన పడుతుంది. 

ఈ లోపు మరో చిత్రాన్ని కంప్లీట్ చేయాలని విక్టరీ వెంకటేష్ కి కథ వినిపించాడంట. ఈ కథ వెంకీకి భాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. అయితే ఈ సినిమాలో మరో యువ హీరోకి ఛాన్స్ ఉండటంతో ఆ రోల్ కోసం చైతన్యని తీసుకోవాలని అనుకుంటున్నారంట. వీరిద్దరి కాంబినేషన్ అయితే క్రేజ్ ఉంటుందని సురేందర్ రెడ్డి ఇలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. 


ఏజెంట్ లాంటి డిజాస్టర్ అఖిల్ కి సురేందర్ రెడ్డి ఇచ్చాడు. ప్రస్తుతం చైతూ కెరియర్ చూసుకుంటే హ్యాట్రిక్ ప్లాప్ ల మీద ఉన్నాడు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ 2లో పాన్ ఇండియా మూవీ భారీ బడ్జెట్ తో చేస్తున్నాడు. వెంకటే శివ నిర్వాణ సినిమాని సెట్స్ పైకి ఎక్కించాల్సి ఉంటుంది. ఇవన్ని పెట్టుకొని సురేందర్ రెడ్డి కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందా అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే మామయ్యా మీద ఇష్టంతో వెంకటేష్ రికమండ్ చేస్తే ఒప్పుకునే ఛాన్స్ కూడా ఉందనేది విశ్లేషకుల మాట. మరి ఈ కాంబినేషన్ మూడో సారి సెంట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Post a Comment

Previous Post Next Post