లియో రామ్ చరణ్.. ఆ రోజే అసలు క్లారిటీ


విజయ్ లియో సినిమాలో అసలు రామ్ చరణ్ ఉన్నాడా లేడా అనే విషయంలో ఇంతవరకు అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ అయితే రావట్లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అనేక రకాల గాసిప్స్ వైరల్ గా మారుతున్నాయి. ఏకంగా పోస్టర్లు కూడా డిజైన్ చేస్తూ హైప్ అయితే ఎక్కిస్తున్నారు. ఇక ఇది మంచిదే అన్నట్లుగా అటు లియో టీం ఇటు తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న సితార వాళ్ళు ఏ విధంగా స్పందించడం లేదు.

అయితే ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ గాసిప్ సోషల్ మీడియాలో మరింత బజ్ అయితే క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ రాబర్ట్ అంటూ సోమవారం రోజు అధికారికంగా క్లారిటీ రానుంది అని ఒక న్యూస్ అయితే వైరల్ చేస్తున్నారు. ఇది కూడా ఎంతవరకు నిజం అనేది క్లారిటీ లేదు. కానీ సోమవారం రోజు మాత్రం ఏదో ఒక అప్డేట్ తో అయితే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఇది లోకేష్ కనకరాజు మల్టీవర్స్ కాదు అని కూడా తెలుస్తుంది. కానీ కమల్ హాసన్ వాయిస్ ఓవర్ మాత్రం ఉంటుందట. మొత్తంగా లియో సినిమా అయితే బజ్ తగ్గినప్పుడల్లా ఏదో ఒక గాసిప్ తో మాత్రం అంచనాలను క్రియేట్ చేస్తోంది. మరి ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post