స్కంద ఎఫెక్ట్.. కాస్త చూస్కోవయ్యా పూరి!


రామ్ పోతినేని స్కంద సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నట్లు బాగానే హడావిడి చేశారు. కానీ సినిమా రిలీజ్ డేట్ సమయానికి మాత్రం మిగతా భాషల్లో అసలు హడావిడి చేయలేదు. చాలా మందికి ఈ సినిమా మిగతా భాషల్లో విడుదల అయిందా లేదా అనే విషయం కూడా సరిగ్గా తెలియదు. ఇక ఏదేమైనా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఓ మోస్తారుగా ఓపెనింగ్స్ అయితే బాగానే అందుకుంది.

కానీ కలెక్షన్స్ విషయంలో కరెక్ట్ నెంబర్లు బయటకు రావడం లేదు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి స్కంద సినిమా కూడా రెగ్యులర్ మాస్ కమర్షియల్ ప్యాటర్న్ లో ఉండడంతో డిజాస్టర్ టాక్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ ప్రభావం రామ్ నెక్స్ట్ సినిమా డబుల్ ఇస్మార్ట్ పై పడబోతుంది. పూరి జగన్నాథ్ అసలే లైగర్ సినిమాతో డిజాస్టర్ ఎదుర్కొని ఉన్నాడు.

 ఇక ఫ్యాన్ ఇండియా లెవెల్లో మరోసారి ఈ కాంబినేషన్ మార్కెట్ క్రియేట్ అవుతుందా లేదా అనేది మరో పెద్ద సందేహం. ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. కాబట్టి బాలీవుడ్ లో మార్కెట్ ఉంటుందేమో అని ఆశతోనే ఉన్నారు. కానీ పూరి రామ్ కాంబినేషన్ అక్కడ ఎంతవరకు ప్రభావం చూపగలరు అనేది రాబోయే ప్రమోషన్స్ అప్డేట్స్ బట్టి ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Post a Comment

Previous Post Next Post