పెదకాపు 1.. బ్రహ్మోత్సవం కంటే దారుణంగా..


శ్రీకాంత్ అడ్డాల కెరీర్ లోనే మర్చిపోలేని బిగ్గెస్ట్ డిజాస్టర్ బ్రహ్మోత్సవం సినిమా. మంచి టాలెంటెడ్ దర్శకుడు అయినప్పటికీ కూడా ప్రయోగాలు చేయడంలో చాలా దారుణంగా దెబ్బతింటున్నారు. రీసెంట్ గా వచ్చిన పెదకాపు 1 సినిమా అయితే మరింత దారుణమైన టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రహ్మోత్సవం కంటే భారీ స్థాయిలో నష్టాలను కలిగిస్తున్నట్లు సమాచారం.

సినిమా పెట్టిన పెట్టుబడికి థియేట్రికల్ బిజినెస్ లో కనీసం ఒక ఐదు శాతం కూడా వెనక్కి తీసుకురాలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 13 కోట్ల రేంజ్ లో అయితే సినిమా బిజినెస్ చేసింది. కనీసం అందులో కోటి రూపాయల షేర్ కలెక్షన్స్ కూడా ఈ సినిమా అందుకోవడం లేదు. మొదటి రోజే చాలా ఏరియాలలో సినిమా థియేటర్స్ లో జనాలు కనిపించలేదు. ఇక తర్వాత డివైడ్ టాక్ రావడంతో మరుసటి రోజు షోలు క్యాన్సిల్ అవుతూ వచ్చాయి. ఇక హాలిడే సీజన్ కూడా ఏమాత్రం హెల్ప్ కాలేదు. మరి శ్రీకాంత్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post