రూల్స్ రంజన్.. కిరణ్ కష్టం క్లిక్కయ్యేలా ఉంది


ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపును అందుకుంటున్న వారిలో కిరణ్ అబ్బవరం ఉంటాడు అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో అతను ఎక్కువగా బిగ్ ప్రొడక్షన్ హౌస్లలో కూడా అవకాశాలు అందుకుంటున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కంటెంట్ సినిమాలను ట్రై చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కామెడీ ఫ్యామిలీ యాక్షన్ మాస్ సినిమాలను కూడా ట్రై చేస్తున్నాడు.

ఇక ఈసారి రొమాంటిక్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన రూల్స్ రంజాన్ సినిమాతో సక్సెస్ అందుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఈ సినిమా విడుదల డేట్ విషయంలో చాలా పకడ్బందీగా ఆలోచించారు. ఇక మొత్తానికి సెప్టెంబర్ ఆరవ తేదీన గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ సినిమా సాంగ్స్ ఇప్పటికే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.

సమ్మోహనుడా పాటతో కావాల్సినంత క్రేజ్ అయితే వచ్చేసింది. ముఖ్యంగా హీరోయిన్ నేహా శెట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండింగ్ హీరోయిన్గా కనిపిస్తోంది. ఇక ఆమె సక్సెస్ స్క్రీక్ కూడా సినిమాకు కలిసొస్తే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ కూడా చాలా పాజిటివ్గా చేస్తున్నారు. ప్రతి సినిమా ప్రమోషన్స్ లో కిరణ్ ఎంతగా హార్డ్ వర్క్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు రూల్స్ రంజన్ విషయంలో కూడా అతను అదే తరహాలో ప్రమోషన్ చూస్తున్నాడు. ఈ సినిమాను జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశాడు.  కిరణ్ అబ్బవరం కష్టానికి అయితే ఈ సినిమా హిట్ అవుతుంది అనే సంకేతాలు అందుతున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post