జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై ఇప్పటివరకు స్పందించకపోవడంతో బాలకృష్ణ అతనిపై చాలా కోపంగానే ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇటీవల ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ స్పందించకపోవడం ఎలా భావిస్తారు అనే ప్రశ్నకు ఐ డోంట్ కేర్ అండ్ బాలయ్య ఓపెన్ గా తెలియజేశారు. అయితే ఈ విషయంలో ఎవరిది తప్పు అనే దానికన్నా కూడా ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి.
ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి క్రిటికల్ సిచువేషన్ లో స్పందించకపోవడమే బెటర్ అనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఎందుకంటే చేతిలో 300 కోట్ల దేవర ప్రాజెక్ట్ను పెట్టుకొని ఇప్పుడు రాజకీయాల్లోకి వెళితే చాలా డ్యామేజ్ అవుతుంది. ఎన్టీఆర్ తో పాటు ఈ ప్రాజెక్టులో కళ్యాణ్ రామ్ కూడా భారీగా పెట్టుబడులు పెట్టాడు. అందుకే ఇద్దరి వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు.
ఒక విధంగా పాలిటిక్స్ లోకి వెళ్లి ఇబ్బంది పడకూడదు అని ఆలోచిస్తున్నారు. ఇక బాలకృష్ణ మాత్రం తన వైపు నుంచి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు రాగానే ఐ డోంట్ కేర్ అనడంతో ఆ పార్టీకి కూడా కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందనే. విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. టిడిపి అభిమానులలో నందమూరి అభిమానుల్లో తారక్ ను అమితంగా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు.
కాబట్టి బాలయ్య మాటలకు ఇప్పుడు రెండు గ్రూపులుగా చీలిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయంలో దూకుడుగా కాకుండా కాస్త ఆలోచించి రియాక్ట్ అయితే పార్టీకి కాస్త పాజిటివ్ గా ఉండేది. కానీ అక్కడ బాలయ్య తన పంతాన్ని చూపించారేమో అనే కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ గతంలో ఎన్టీఆర్ టిడిపి పార్టీ కోసం బాగానే పని చేశాడు. కానీ అతని అవసరం మేరకు మాత్రమే వాడుకున్నారు అనే విధంగా కూడా కామెంట్స్ వచ్చాయి. ఇక మళ్లీ రాజకీయాల్లోకి అటువైపుగా వెళ్లకూడదు అని తారక్ భావించినట్లు తెలుస్తోంది. మరి ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.
Follow
Follow
Post a Comment