నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా ఎక్కువ స్థాయిలో నష్టాలు చూపించిన సినిమాలు అజ్ఞాతవాసి స్పైడర్. ఈ రెండు సినిమాలతో ఆయన దాదాపు 30 కోట్లకు పైగానే పోగొట్టుకున్నారు. అజ్ఞాతవాసి సినిమా నైజాం హక్కులను దాదాపు 27 కోట్ల రేంజ్ లో అందుకోగా స్పైడర్ నైజాం రైట్స్ 20 కోట్ల రేంజ్ లోనే దక్కించుకున్నారు.
ఇక ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాపై కూడా ఆయన భారీ స్థాయిలో పెట్టుబడి పెడుతున్నారు. ఆ రెండు సినిమాలు దెబ్బ కొట్టిన తర్వాత అత్యధిక స్థాయిలో మళ్లీ వారి సినిమాలపైనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈసారి గుంటూరు కారం సినిమా హక్కులను నైజం రైట్స్ దాదాపు 45 కోట్లకు పైగానే ఖర్చుచేసి కొనుగోలు చేస్తున్నారు. ఒకవైపు అజ్ఞాతవాసి డిజాస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్, మరొకవైపు స్పైడర్ తో దెబ్బ కొట్టిన మహేష్. ఈ రెండు కాంబినేషన్స్ లో ఇప్పుడు వస్తున్న గుంటూరు కారం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
Follow
Post a Comment