గుంటూరు కారం అంటే భయం లేదా.. అంత సీన్ లేదా?


సాధారణంగా సంక్రాంతికి ఒక పెద్ద సినిమా వస్తోంది అంటే మిగతా సినిమాలు రావడానికి కాస్త వెనుకడుగు వేస్తూ ఉంటాయి. ఇక మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఇండస్ట్రీలో మొదట్లోనే ఒక పాజిటివ్ బజ్ అయితే పెరిగింది. కానీ ఎప్పుడైతే వాళ్ళు గుంటూరు కారం ప్రాజెక్టు అంటూ ముందుకు సాగారో అప్పటినుంచి కూడా సినిమాపై కాస్త నెగటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. 

ఇక ఈ సినిమాకు అంత సీన్ లేదని అనుకున్నారో ఏమో మరి మిగతా వాళ్ళు సంక్రాంతికి రావడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ముందుగానే నాగర్జున తన సెంటిమెంట్ ప్రకారం నా సామీ రంగతో రాబోతున్నట్లు చెప్పేశాడు. ఇక హనుమాన్ ఎప్పటి నుంచో సంక్రాంతికి వస్తున్నాము అని క్లారిటీ ఇచ్చింది. రవితేజ ఈగల్, వెంకటేష్ సైంధవ్ కూడా సంక్రాంతికి వస్తున్నాయి. 

ఇక విజయ్ దేవరకొండ పరుశురాం ఫ్యామిలీ సినిమా కూడా సంక్రాంతిని టార్గెట్ చేసింది. పోటీలో మహేష్ బాబు త్రివిక్రమ్ వున్న కూడా థియేటర్స్ ఉంటే చాలు అనేంతలా మిగతా సినిమాలు దూసుకొస్తున్నాయి. మరి వీటన్నిటికీ గట్టి పోటీని ఇవ్వాలి అంటే గుంటూరు కారం కాంబినేషన్ నమ్ముకోకుండా ముందుగా ప్రమోషన్స్ స్ట్రాంగ్ గా చేయాల్సి ఉంటుంది. ఇక ఎక్కువ థమన్ పైనే భారం ఉంది. మరి ఈసారి అతను ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post