ది వారియర్ + స్కంద నష్టాలు.. రామ్ తో రిస్క్ అవసరమా?


రామ్ పోతినేని మంచి హీరోనే కానీ అనవసరంగా అతనిపై ఎక్కువ స్థాయిలో బడ్జెట్ పెట్టి నిర్మాతలు రిస్క్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా అప్పుడు ఉన్న టైంలో కమర్షియల్ గా మంచి కలెక్షన్స్ అందుకుంది. దీంతో ఆ తర్వాత సినిమాలు కూడా అదే తరహాలో ఉండాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ కంటెంట్ తో పాటు తగిన టైం కూడా కుదరాలి. రామ్ పోతినేని ఆ తర్వాత రెడ్ సినిమా కాస్త లిమిట్ బడ్జెట్ లోనే వచ్చి మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

కానీ ఆ తర్వాత వచ్చిన ది వారియర్ సినిమా అనవసరమైన బడ్జెట్ ఎక్కువగా పెట్టడంతో దాదాపు 17 కోట్ల రేంజ్ లో నష్టాలు వచ్చాయి. ఇక ఇప్పుడు స్కంద పరిస్థితి కూడా దాదాపు అదే స్థాయిలో ఉంది. ఈ సినిమాకు కూడా 13 నుంచి 15 కోట్లు మధ్యలో నష్టాలు వచ్చే అవకాశం అయితే ఉంది. రామ్ తో బిగ్ బడ్జెట్ సినిమాలు చేయాలనుకోవడంలో తప్పులేదు కానీ అందుకు తగ్గట్టు ప్లానింగ్ కూడా ఉండాలి. కంటెంట్ మిస్ అవ్వగా ఇప్పుడు స్కంద సినిమాలో మాస్ ఓవర్ లోడ్ కావడంతో బాక్సాఫీస్ డిజాస్టర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి నెక్స్ట్ డబుల్ ఇస్మార్ట్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post