బోయపాటి పవర్ఫుల్ లైనప్.. అయ్యే పనేనా?


బోయపాటి శ్రీను ఎప్పటిలానే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో తెరపైకి తీసుకువచ్చిన స్కంద సినిమా నిరాశపరిచింది. ఈ సినిమా హాలిడేస్ కారణంగా ఎక్కువ నష్టాలు రాకుండా తప్పించుకుంది అని చెప్పవచ్చు. ఇక ట్రోలింగ్ మెటీరియల్ అయితే బోయపాటి ఎప్పటిలానే గట్టిగా ఇచ్చాడు. ఇక నెక్స్ట్ హీరో సూర్య బోయపాటితో సినిమా చేస్తాడా లేదా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి.

సూర్య అయితే మాట ఇచ్చాడట. ఇక బోయపాటి ఆయనను ఎలాంటి క్యారెక్టర్ లో చూపిస్తాడో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఇక బోయపాటి ఆ ప్రాజెక్టును గీతా ఆర్ట్స్ లోనే చేయబోతున్నారు. అలాగే గీత ఆర్ట్స్ లోనే బన్నీతో కూడా మరో సినిమా చేయాల్సి ఉంది. ఇక అఖండ సీక్వెల్ ద్వారక క్రియేషన్స్ లో రానుంది. ఈ ప్రాజెక్టు విషయంలో అయితే కన్ఫ్యూజన్ లేదు.

ఇక మహేష్ బాబుతో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ డేట్స్ క్లాష్ కారణంగా ఇద్దరికీ టైం దొరకడం లేదు అని బోయపాటి ఇటీవల ఇంటర్వ్యూలో తెలియజేశాడు. కానీ ఇప్పుడు వెళుతున్న తరహాలోనే బోయపాటి అల్లు అర్జున్ మహేష్ లకు కథ చెబితే వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది మరొక పెద్ద డౌటు. ఇక బోయపాటి సూర్యతో చేయబోయే సినిమాను బట్టి అతని భవిష్యత్తు అవకాశాలపై క్లారిటీ వస్తుంది. చూడాలి మరి ఏం చేస్తాడో.

Post a Comment

Previous Post Next Post