అయ్యో సుధీర్ బాబు.. మరీ ఇంత దారుణంగానా..


ఘట్టమనేని అల్లుడుగారు సుధీర్ బాబు బాక్సాఫీస్ వద్ద మరొక డిజాస్టర్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం విడుదలైన మాయ మశ్చీంద్రా సినిమా అసలు ఏమాత్రం వర్కవుట్ కాలేదు. మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద జీరో షేర్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కష్టపడే తత్వం ఓపిక ఉన్నప్పటికీ కూడా సుధీర్ బాబుకు ఎందుకు సక్సెస్ రావడం లేదు అనే ప్రశ్న చాలా మందిలో కలుగుతుంది.

మొదట్లో ఒక రెండు మూడు సినిమాలతో బాగానే సక్సెస్ చూసిన ఆయన మళ్లీ చాలాకాలం తర్వాత సమ్మోహణం అనే మరో సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇక మళ్ళీ ఆ తర్వాత ఎప్పటిలానే డిజాస్టర్ బాట పట్టాడు. సుధీర్ బాబుకి అప్పుడప్పుడు చిన్న తరహా సక్సెస్ లు వస్తున్నప్పటికీ అతని మార్కెట్ రేంజ్ను అయితే పెంచడం లేదు. ఇక ఇప్పుడు మాయామశ్చింద్ర సినిమా అయితే దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఒక విధంగా అతను కథలో ఎంపిక విషయంలో మరింత ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా వరకు జడ్జిమెంట్ కరెక్ట్ కావడం లేదు. కాబట్టి కొత్తగా ఆలోచించే నేటి తరం యువ దర్శకులతో కొంత రిస్క్ తీసుకుంటే బెటర్. మరి రాబోయే రోజుల్లో ఆయన ఎలాంటి కథలను సెలెక్ట్ చేసుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post