బోయా మోసం.. కొరటాల లాంటి దెబ్బ అవసరమా?


సినిమా ప్రపంచంలో ఇటీవల కాలంలో దర్శకులు వారి స్టైల్ ని మార్చుకోకపోతే ప్రేక్షకులు తిరస్కరిస్తున్న విధానం మామూలుగా ప్రభావం చూపించడం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ చూసిన దర్శకులు కూడా ఇప్పుడు రెగ్యులర్ రొటీన్ సినిమాలు తీయడం వల్ల తొందరగా ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఈ లెక్కలో ఇప్పటికే పూరి జగన్నాథ్ తేజ బి.గోపాల్, వినాయక్ లాంటి వాళ్ళు తేలిపోయారు. 

ఇక త్రివిక్రమ్ సక్సెస్ అందుకున్న కూడా చర్చల దశలోనే హీరోలను పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ తో మెప్పించలేకపోతున్నాడు. అజ్ఞాతవాసి దెబ్బ ఇంకా ఆడియన్స్ మర్చిపోలేదు. అయితే రీసెంట్ గా కొరటాల శివ ఆచార్య కూడా ఏ స్థాయిలో దెబ్బ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొరటాల శివ మొదట్లో ఓకే ఫార్ములాతో తీసుకువచ్చిన సినిమాలో బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత కూడా అదే టైమింగ్ తో వెళితే మాత్రం వర్కవుట్ కాదని ఆయనకు ఆచార్య దెబ్బ కొట్టిన తర్వాత గాని జ్ఞానోదయం కాలేదు.

ఇక పూరి జగన్నాథ్ కు ఇటీవల లైగర్ సినిమాతోనే పూర్తిస్థాయిలో ఒక క్లారిటీ వచ్చి ఉండాలి. మరి నెక్స్ట్ ఆయన ఏం చేస్తారో చూడాలి. ఇక బోయపాటి శ్రీను మాత్రం ఒకసారి భారీ దెబ్బ తిన్నా కూడా మళ్లీ అదే తరహాలో కొనసాగుతూ ఉండడం విశేషం. వినయ విధేయ రామ సినిమా కంటే ముందే బోయపాటికి దమ్ము సినిమాతో డిజాస్టర్ దెబ్బ గట్టిగానే కొట్టింది. మాస్ ఊబిలోనే బోయా ఇంకా ఎన్నాళ్ళు తనను తానే మోసం చేసుకుంటాడు. 

 ఫ్లాప్స్ వచ్చినా మళ్లీ ఏదో ఒక మాస్ సినిమాతోనే బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు. హీరోల ఇమేజ్ వల్ల ఒక విధంగా బోయపాటికి బాగా కలిసి వస్తోంది. కానీ ఆయన అనుకున్న కంటెంట్ ఆడియన్స్ కు ఏ విధంగా రీచ్ అవుతుంది? భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మాత్రం ఊహించడం లేదు. స్కంద సినిమాతో బోయపాటి రెగ్యులర్ రొటీన్ మాస్ విధానంపై ఆడియన్స్ ఇప్పటికే పెదవి వివరించారు. ఇక ఆయన నెక్స్ట్ సినిమాలో ఇదే తరహాలో కొనసాగితే మాత్రం ఊహించని దెబ్బ పడుతుంది అని చెప్పవచ్చు. స్కంద సినిమా హాలిడే మూమెంట్లో ఓపెనింగ్స్ పరవాలేదు అనిపించింది. కానీ తేడా కొడితే మాత్రం మరోలా ఉండేది. ఇకనైనా బోయపాటి కాస్త ఆచి తూచి అడుగు వేస్తే బెటర్.

Post a Comment

Previous Post Next Post