ఉదయం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి. సలార్ సినిమాతో పాటు టైగర్3 సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు చాలా రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. అయితే సలార్ సినిమాలో కనిపించడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ మల్టీవర్స్ తరహా లోనే కేజీఎఫ్ ను మిక్స్ చేసి ఎన్టీఆర్ తో చేయబోయే ప్రాజెక్టును కూడా దీనిలో కలిపి హైప్ పెంచే అవకాశం ఉన్నట్లు గతంలోనే టాక్ వచ్చింది.
సలార్ సినిమా చివరలోనే యష్ పాత్రతోపాటు ఎన్టీఆర్ పాత్రను కూడా చూపించే ఛాన్స్ ఉందట. ఇక మరోవైపు సల్మాన్ ఖాన్ నుంచి రాబోయే టైగర్ 3 సినిమాలో కూడా ఎన్టీఆర్ కనిపిస్తాడని జోరుగా టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ వార్ 3 సినిమాలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే యష్ రాజ్ ఫిలిమ్స్ కూడా మల్టీవర్స్ ప్రాజెక్టులను కంటిన్యూ చేస్తోంది. కాబట్టి ఎన్టీఆర్ టైగర్ 3 లో కూడా మెరుస్తాడని కొన్ని గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. ఇందులో నిజమైతే లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ వార్ సినిమాతోనే బాలీవుడ్ వెండితెరకి పరిచయం కాబోతున్నాడు. ఇక ప్రస్తుతం దేవర సినిమాతో తారక్ చాలా బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow
Post a Comment