త్రివిక్రమ్ లిస్టులో మరో బిగ్ హీరో!


త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అనుకుంటున్నాడు. ఇక మరోవైపు అల్లు అర్జున్ తో కూడా ఒక ప్రాజెక్టు గురించి అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే మరోవైపు బన్నీ పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత అట్లీ దర్శకత్వంలో ప్రాజెక్టు స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా కొత్త టాక్ వినిపిస్తోంది.

ఈ క్రమంలో మళ్లీ గ్యాప్ రాకుండా త్రివిక్రమ్ మరొక మెగా హీరోను సంప్రదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ ఎప్పటినుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. గతంలో జై చిరంజీవ సినిమాకు రచయితగా వర్క్ చేసిన త్రివిక్రమ్ ఆ తర్వాత కూడా మెగాస్టార్ తో సినిమా చేయాలని అనుకున్నారు. 

కానీ ఆ కాంబినేషన్ అప్పుడు సెట్ కాలేదు. కానీ ఇప్పుడు చిరంజీవి వశిష్ట ప్రాజెక్టు తో పాటు త్రివిక్రమ్ సినిమాను కూడా లైన్లో పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మెగాస్టార్ ఇంతకుముందు కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టును చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతనితో ఆ కాంబినేషన్ క్యాన్సిల్ అయింది. దీంతో త్రివిక్రమ్ వైపు యూ టర్న్ తీసుకున్నట్లు టాక్.

Post a Comment

Previous Post Next Post