Hi Nanna మూవీ - రివ్యూ & రేటింగ్


కథ:

విరాజ్ (నాని) ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్‌. ముంబైలో ఆరేళ్ల తన కుమార్తె మహి (బేబీ కియారా)తో ఉంటాడు. ఇక తన తల్లి గురించి మరింత తెలుసుకోవాలని కూతురు మహికి ఉంటుంది. కానీ విరాజ్ మాత్రం కుమార్తెకు ఆ సమాచారాన్ని చెప్పడానికి ఇష్టపడడు. అయితే అనుకోకుండా ఒకరోజు యష్నా (మృణాల్ ఠాకూర్)ని కలవగానే విరాజ్ తను ఇన్నాళ్లు దాచుకున్న కథను బయటపెట్టవలసి వస్తుంది. అసలు మహి తల్లి ఎవరు, ఆమెకు విరాజ్‌కి మధ్య అసలు ఏం జరిగింది? ఎందుకు కూతురికి తల్లి గురించి చెప్పడానికి ఇష్ట పడలేదు? అసలు యష్నా విరాజ్ మధ్య ఏమి జరిగింది? అనేది ఈ సినిమాలోని అసలు అంశాలు.


విశ్లేషణ:
దసరా సినిమా తర్వాత నాని హాయ్ నాన్న లాంటి క్లాస్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తాడు అని ఎవరు ఊహించలేదు. ఒక విధంగా నాని ఇలాంటి సినిమాలతోనూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. నిన్ను కోరి కూడా ఇదే తరహాలో వచ్చిందే. ఇక తన నేచురల్ యాక్టింగ్ కూడా ఇలాంటి కథల లోనే ఎక్కువగా హైలైట్ అవుతూ వస్తోంది. అందుకే ప్రేక్షకుల హృదయాలకు ఎప్పుడూ దగ్గరగా ఉండాలి అని ఎమోషనల్ పాయింట్ ను ఎక్కువగా టచ్ చేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. 

ఇక హాయ్ నాన్న సినిమా విషయానికి వస్తే నాని క్యారెక్టర్ విషయంలో అయితే కొత్తగా చేసినట్లుగా ఏమీ అనిపించదు కానీ ఇందులోని సన్నివేశాలు అలాగే లవ్ స్టోరీ యాంగిల్, కూతురు ఎమోషనల్ బాండింగ్ ఇవన్నీ కూడా ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగిస్తూ ఉంటాయి. దర్శకుడు తన అనుకున్న పాయింట్ ను సెకండ్ హాఫ్ వరకు కాస్త సస్పెన్స్ తో క్రియేట్ చేసినప్పటికీ ఆడియన్స్ అయితే ముందుగానే ఊహించినట్లుగానే ఈ కథ కొనసాగుతూ ఉంటుంది. ఆ విషయంలో దర్శకుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది.

 కానీ ఎమోషనల్ సన్నివేశాలలో మాత్రం అతను చాలా చక్కగా డీల్ చేశాడు. అలాగే కూతురు సెంటిమెంటు సీన్స్ అయితే బాగా వచ్చాయి. ఇక తండ్రి కూతురు మధ్యలో ఊహించిన విధంగా మరొక క్యారెక్టర్ వచ్చినప్పుడు దాన్ని డీల్ చేసిన విధానం కూడా ఈ సినిమాలో మరొక మేజర్ ప్లస్ పాయింట్. ఫస్ట్ హఫ్ మొత్తం కూడా కొన్ని సరదా సన్నివేశాలు క్యూట్ మూమెంట్స్ తో సాగిన హాయ్ నాన్నలో సెకండ్ హాఫ్ లో అసలైన ఎమోషన్లు హైలెట్ చేయడం జరిగింది.

 ఎక్కువగా ఫస్ట్ హాఫ్ లోనే అక్కడక్కడ సినిమాలో కొన్ని బోరింగ్ సన్నివేశాలు ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం దర్శకుడు కాస్త స్లోగా కథను నడిపినప్పటికీ కూడా గుండెకు హత్తుకునేలా సన్నివేశాలతో ప్రేక్షకుల మనసులు తన వైపుకు తిప్పుకున్నాడు. ఇక ఫ్రీ క్లైమాక్స్ అలాగే క్లైమాక్స్ లో అసలైన అంశాలు ఇందులో ఒక మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంగీత దర్శకుడు హేశం అబ్దుల్ ఈ సినిమాకు తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మరింత ప్రాణం పోశాడు అని చెప్పవచ్చు. పాటలు అన్నీ కూడా సిచువేషన్ కు తగ్గట్టుగా కరెక్ట్ గా సెట్ అయ్యాయి. 

మ్యూజిక్ మాత్రం చాలా కొత్తగా ఉంది. కథ విషయంలో అంతగా కనిపించే అంశాలు ఏమీ లేవు కానీ అక్కడక్కడ కొన్ని చిన్న ట్విస్ట్ లు పరవాలేదు అనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనా దర్శకుడు శౌర్యువ్ తన మొదటి కథలో మాత్రం ఆడియన్స్ ను ఒక విభిన్నమైన తరహాలో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు ఇక నాని నటన ఎప్పటిలానే చాలా న్యాచురల్ గా ఉండగా చిన్నారి కీయరా మాత్రం తన క్యూట్స్ హావబావాలతో చాలా బాగా హైలైట్ అయింది. ఇక మృణాల్ కూడా సెకండ్ హాఫ్ లో కొన్ని సీరియస్ సీన్స్ తో కూడా చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఈ సినిమా ఒక ఎమోషనల్ సన్నివేశాలలో మంచి పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. మధ్యలో కొంత నెమ్మదిగా అనిపించినప్పటికీ చివరి క్లైమాక్స్ లో మాత్రం సీన్స్ ఫ్రెష్ గా ఉండడంతో సినిమా సంతృప్తిని ఇస్తుంది. అయితే ఇంత ఎమోషనల్ డెప్త్ ఉన్న సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఇంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్:
👉ఎమోషనల్ సీన్స్
👉క్యాస్టింగ్
👉మ్యూజిక్

మైనస్ పాయింట్స్:
👉రొటీన్ కథనం
👉ఫస్ట్ హాఫ్

రేటింగ్: 3/5

Post a Comment

Previous Post Next Post