గుంటూరు కారం.. అవసరం లేని మంట!


మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ట్రోలింగ్స్ ఇప్పుడు మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి. సినిమాలోని మొదటి పాట దమ్ బిర్యానీ కాస్త పర్వాలేదు అనిపించింది కానీ ఆ తర్వాత వచ్చిన ఓ మై బేబీ సాంగ్ పై మాత్రం ఊహించిన స్థాయిలో ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి. ఇందులో లిరిక్స్ కూడా అంత కొత్తగా ఏమీ లేవు అని ఓ వర్గం మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక పాట రాసిన రామజోగయ్య శాస్త్రి అయితే కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. 

ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి మాట్లాడండి అంటూ ఆయన స్పందించిన విధానం ఒక విధంగా చాలా ఓవర్ రియాక్షన్ అనేలా కామెంట్స్ అయితే వస్తున్నాయి అయితే ఇంతలో నిర్మాత నాగ వంశీ కూడా అనిమల్ లాస్ట్ సీన్ తో మరింత కాంట్రవర్సీ క్రియేట్ చేసే విధంగా ఒక వార్నింగ్ లాగా ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. ట్రోల్స్ పై మరీ ఈ స్థాయిలో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు.

థమన్ పాటలకు ట్రోలింగ్ అనేది కొత్త కాదు. గతంలో చాలామందికి ఇదే తరహాలో ట్రోలింగ్స్ వచ్చాయి. అనిరుద్ పై కూడా అప్పుడప్పుడు ఇలానే ట్రోల్స్ చూస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ కూడా గతంలో చాలాసార్లు ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. కానీ వారు ఎవరు కూడా పెద్దగా ఆ విషయంపై రియాక్ట్ కాలేదు. పట్టించుకోకుండా వదిలేస్తే ఎవరూ కూడా రియాక్ట్ కారు. కానీ గుంటూరు కారం వాళ్ళు మరీ ఎందుకింద రియాక్ట్ అవుతున్నారు అనేలా కామెంట్స్ వస్తున్నాయి.

Post a Comment

Previous Post Next Post