దేవర.. రొమాంటిక్ డోస్ కూడా..

 


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవరను ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఇంకా 40 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉందంట. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా పూర్తి కావడానికి సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడినట్లుగానే కనిపిస్తోంది. కొత్త రిలీజ్ డేట్ అక్టోబర్ 10 అని టీమ్ ఈరోజు అనౌన్స్ చేసింది. ఇదిలా ఉంటే దేవర మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కి కొరటాల శివ సిద్ధం అవుతున్నారు.


ఈ షెడ్యూల్ గురించి ఇంటరెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది.  ఇందులో కంప్లీట్ గా సాంగ్స్ ని, రొమాంటిక్ సీక్వెన్స్ ని చిత్రీకరించనున్నారంట. మూవీలో మొత్తం నాలుగు పాటలు ఉండగా అందులో రెండు తారక్, జాన్వీ కపూర్ మీద డ్యూయెట్స్ గా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ రెండు పాటలు ఇప్పుడు షూట్ చేయనున్నారని టాక్. అలాగే ఇద్దరికి సంబందించిన రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఈ షెడ్యూల్ లో కంప్లీట్ చేయనున్నారంట. దీని తర్వాత సైఫ్ అలీఖాన్ వచ్చే వరకు మళ్ళీ గ్యాప్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన గాయం నుంచి కోలుకొని షూటింగ్ లో జాయిన్ అయితే మిగిలిన యాక్షన్ సీక్వెన్స్ తో పాటు టాకీ పార్ట్ కంప్లీట్ అవ్వనుందని సమాచారం.

Post a Comment

Previous Post Next Post