మైత్రి ఎన్టీఆర్ vs దిల్ రాజు పవన్!

 


నైజాం అనగానే అందరికి గుర్తొచ్చే పేరు దిల్ రాజు. కానీ ఇప్పుడు ఆయనకు పోటీగా మైత్రి మూవీ మేకర్స్ కూడా గట్టిగానే అడుగులు వేస్తోంది. ఈ సంస్థ సంక్రాంతిలో హనుమాన్ సినిమాతో సాలీడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. గుంటూరు కారంను రాజుగారు గ్రాండ్ గా రిలీజ్ చేసినప్పటికీ హనుమాన్ పై పెద్దగా ప్రభావం అయితే చూపలేదు. కంటెంట్ ఎప్పుడు కింగ్ అని సంక్రాంతి రుజువుగా నిలిచింది.


ఇక రాబోయే దసరా సమయంలో కూడా మైత్రి vs దిల్ రాజు మధ్యలో పోటీ గట్టిగానే ఉంటుందని అనిపిస్తుంది. దేవర నైజాం హక్కులు మైత్రి వాళ్ళు సొంతం చేసుకోగా పవన్ OG రైట్స్ దిల్ రాజు చేతికి వెళ్లాయి. దేవర కంటే ముందు OG థియేటర్స్ లోకి రానుంది. ఇక రెండు సినిమాల మధ్య థియేట్రికల్ రిలీజ్ వ్యవహారం కొంత హీట్ పెంచే అవకాశం ఉంది. దసరా టైమ్ కాబట్టి రెండు సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ రెండు సినిమాల మధ్యలో మిగతా సినిమాలు పోటీగా నిలబడకపోవచ్చు. మరోసారి దిల్ రాజు మైత్రి వారి క్లాష్ లో ఎవరు నెగ్గుతారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post