బన్నీ బెర్లిన్ ప్లాన్.. అసలు కారణం ఇదే!


అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ నుండి విరామం తీసుకొని నిర్మాత మైత్రి రవిశంకర్‌తో కలిసి జర్మనీలోని బెర్లిన్‌కు వెళ్లారు. అయితే షూటింగ్ ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకొని మరి ఎందుకు వెళ్లారు అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.  పుష్ప 2 నిర్మాతలు వాస్తవానికి పుష్పకు ప్రపంచ స్థాయిలో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారని టాక్ వస్తోంది.  ఆ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పుష్పను ప్రదర్శించడం ద్వారా, వారు యూరప్ నుండి డిస్ట్రిబ్యూటర్‌లను కనుగొని, వారి స్వంత భాషలలో సినిమాను కొనుగోలు చేసి విడుదల చేయాలనుకుంటున్నారు. 


ఇంటర్నేషనల్ లెవెల్లో పంపిణీదారులను కనుగొనడానికి తప్పకుండా హీరో చాలా చలన చిత్రోత్సవాలకు వెళ్లాలి. అందుకే అల్లు అర్జున్ నిర్మాతలు ఇప్పుడు సరైన ట్రాక్ లో బెర్లిన్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఇప్పటికే పుష్ప: ది రూల్ భారతదేశంలోనే 4-5 భాషలలో విడుదల కానుంది.  దర్శకుడు సుకుమార్ ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషలలో కూడా భారీగా విడుదల చేయాలనుకుంటున్నారు.  పుష్ప 1 రష్యన్ వెర్షన్ అంత గొప్పగా ఆడలేదు. అయినప్పటికీ నమ్మకం కోల్పోకుండా ఇప్పుడు పుష్ప 2 కోసం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.

Post a Comment

Previous Post Next Post