బాలయ్య సినిమా.. బడ్జెట్ 200 కోట్లు?

 


నందమూరి బాలకృష్ణ గత కొంతకాలంగా తన మార్కెట్ ను కూడా గట్టిగా పెంచుకుంటూ ఉన్నాడు  టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీర సింహారెడ్డి సినిమాకు డివైడ్ కి వచ్చినప్పటికీ కూడా ఆ సినిమాకు బాక్సాఫీస్ వద్ద 130కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడం విశేషం. ఇక రాబోయే నెక్స్ట్ సినిమాలతో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలి అని బాలయ్య బాబు అడుగులు వేస్తున్నారు.

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత కూడా లిస్టులో కొంతమంది దర్శకులు రెడీగా ఉన్నారు. కానీ బాలకృష్ణ ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు. అయితే శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ కూడా బాలకృష్ణతో ఒక హిస్టారికల్ కథను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  ఇప్పటికే పూర్తి స్థాయిలో కథ రెడీ అయినట్లు సమాచారం. అయితే బడ్జెట్ మాత్రం దాదాపు రెండు వందల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇంకా చర్చిల దశలోనే ఉన్న ఈ సినిమాపై ఇంకా బాలకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కథ నచ్చినా బడ్జెట్ విషయంపైనే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రాహుల్ ఈ కాంబినేషన్ ని సెట్ చేస్తాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post