ఆర్ నారాయణమూర్తి.. మరో మెగా ప్రాజెక్ట్ రిజెక్ట్

 


సినిమా ఇండస్ట్రీలో చాలావరకు డబ్బు చుట్టే నిర్ణయాలు తిరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆర్టిస్టులు నచ్చకపోయినా సినిమాలు చేస్తున్నారు అంటే వారికి రెమ్యునరేషన్ గట్టిగానే వస్తుంది అని చెప్పవచ్చు. అయితే మనసుకు నచ్చిన పాత్రలు చేసేవారు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. ఇక నిబద్ధతతో తన సినీ జీవితంలో ఏప్పుడు కూడా డబ్బుకు తలవగ్గని ఏకైక మనిషి ఆర్ నారాయణమూర్తి.


ఇప్పటివరకు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఉంటే మాత్రం వదలకోట్ల ఆస్తిని సంపాదించుకునేవారు అని చెప్పవచ్చు. కానీ ఇప్పటికి అయినా అలాంటి ఆఫర్లు వచ్చినా కూడా సున్నితంగా తిరస్కరిస్తున్నారు. సామాజిక అంశాలతో జనాలను చైతన్య పరిచే సినిమాలు తప్ప కమర్షియల్ సినిమాల చేయనని ఒక నిబద్ధతో వెళుతున్నారు. ఇప్పటికి ఆయన అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. ఇక నారాయణమూర్తికి రీసెంట్ గా ఒక మెగా హీరో సినిమాలో క్యారెక్టర్ చేసే అవకాశం రాగా రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.

ఇదివరకే జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో పోసాని చేయాల్సిన కానిస్టేబుల్ పాత్ర ఆయన చేయాల్సింది. కానీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా కమర్షియల్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయనని అన్నారు. ఇక ఇటీవల మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు ఆయనను సంప్రదించగా రిజెక్ట్ చేసినట్లు టాక్. 2 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినా ఆయన ఒప్పుకోలేదట. దీన్నిబట్టి ఎర్రన్న వ్యక్తిత్వం ఎలాంటిదో మరోసారి రుజువైంది.

Post a Comment

Previous Post Next Post