విజయ్ రెమ్యునరేషన్ 150 కోట్లు కాదు.. ఇంకా ఎక్కువే..

 


ఇళయదళపతి విజయ్ తన సొంత రాజకీయ పార్టీపై ఇటీవల అందరికి షాక్ ఇచ్చేలా క్లారిటీ ఇచ్చాడు. ఇక అతను సినిమాలకు విరామం తీసుకోనున్నాడు.  తన ప్రస్తుత ప్రాజెక్ట్ లను పూర్తి చేసిన తర్వాత, అతను RRR నిర్మాత DVV దానయ్యకు ఒక సినిమా చేయాలి. అతని రాజకీయ అరంగేట్రం చేయడానికి ముందు ఇది అతని చివరి చిత్రం అవుతుంది. ఇక ఆ సినిమాకు అతను తీసుకునే రెమ్యునరేషన్ పై ఇప్పుడు అనేక రకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి.


విజయ్ దాదాపు 200 కోట్ల రెమ్యునరేషన్‌గా కోట్ చేశాడని అంటున్నారు. అలాగే నిర్మాత ఆమోదం తెలిపాడని టాక్ వస్తోంది. ఇది ఎంతవరకు నిజమో కానీ నిజానికి విజయ్ క్రేజ్ వలన అతని డిమాండ్ ఆ రేంజ్ లోనే ఉంది. కానీ ఇంతకుముందు సినిమాలకు 120 కోట్లు తీసుకున్న విజయ్ ఏకంగా ఇప్పుడు 200 కోట్లకు వెళ్లడం ఆశ్చర్యం కలిగించే అంశమే. ప్రస్తుతం దర్శకుడి కోసం వేట కొనసాగుతోంది. ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.  సరైన సమయంలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

వరిసు కోసం దిల్ రాజు 120 కోట్లు చెల్లించగా..  విజయ్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న గోట్ సినిమా కోసం దాదాపు 150 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.  వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా, ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నారు.  ఈ సినిమా ఈ ఏడాది విడుదలవుతుంది. ఇప్పుడు దానయ్య అంతకుమించి అనేలా 200 కోట్లు చెల్లించనున్నాడట. చూడాలి మరి ఆ సినిమా ఏ డైరెక్టర్ చేతుల్లోకి వెళుతుందో.

Post a Comment

Previous Post Next Post