టిల్లు స్క్వేర్.. టార్గెట్ అన్ని కోట్లా?

 


DJ టిల్లు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ఇప్పుడు దానికి సీక్వల్ గా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తప్పకుండా ఈ సినిమాతో అతను మంచి సక్సెస్ అందుకోవాల్సిన అవసరం ఉంది. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలలో సెకండ్ హీరోగా కనిపించిన సిద్దు టిల్లు క్యారెక్టర్ తోనే జనాల్లో బాగా క్లిక్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కు మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఏర్పరచుకుంది.


దీంతో ఇప్పుడు భారీగా ఖర్చు చేసి విడుదల చేయడానికి సిద్ధమయింది. దాదాపు 27 కోట్ల రేంజ్ లోనే సినిమాకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఓటీటీ ద్వారా మంచి డీల్ సెట్ అయినట్లు సమాచారం. ఇక మార్కెట్లో ఈ సినిమా దాదాపు 35 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ దిశగా అయితే నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. ఇక తప్పనిసరిగా ఈ సినిమాతో సిద్దు  టిల్లు స్క్వేర్ ద్వారా దాదాపు 40 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సిన అవసరం ఉంది. టాక్ ఏ మాత్రం బాగున్నా కూడా 50 కోట్లు అయితే వస్తాయి. మరి సినిమా కంటెంట్ ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post