అసలే సక్సెస్ లేదు.. బన్నీ ఆమెకు ఛాన్స్ ఇస్తాడా?

పుష్ప మూవీ తర్వాత బన్నీ లైనప్ అదిరిపోయేలా ఉంది. స్టార్ డైరెక్టర్లు త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా తో పాటు బోయపాటి శ్రీనుతో వరుస చిత్రాలు చేసేందుకు ఐకాన్ స్టార్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. ఈ మూడు సినిమాలు కాకుండా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో కూడా అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు పుష్ప అయ్యాక అట్లీతో మూవీ చేసిన తర్వాతే.. మిగతావారికి టైం ఇవ్వాలని బన్నీ ఫిక్స్ అయ్యారట.

ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో తాజాగా హీరోయిన్ ఫిక్స్ అయినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే.. బన్నీ సరసన నటించనున్నట్లు బజ్ వినిపిస్తోంది. పూజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పూజకు బన్నీ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారని ఫ్యాన్స్ అంటున్నారు. గతంలో అల్లు అర్జున్ తో రెండు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. డీజే, అలా వైకుంఠపురంలో హీరోయిన్ గా యాక్ట్ చేసి మంచి హిట్లు కొట్టింది.

మరోవైపు, కొన్ని నెలలుగా పూజా హెగ్డే సినిమాలు వరుసగా ఫ్లాపులు అవుతున్నాయి. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, కిసీకా భాయ్ కిసీకా జాన్ డిజాస్టర్స్ గా నిలిచాయి. గుంటూరు కారంతోపాటు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆమెనే తప్పుకుంది. ప్రస్తుతం గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. మరి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డేకి బన్నీ మరోసారి ఛాన్స్ ఇస్తారా? కాంబో రిపీట్ అయ్యి హ్యాట్రిక్ కొడతారా? లేదా అనేది చూడాలి.

Post a Comment

Previous Post Next Post