పెద్ది.. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రిజెక్ట్ చేశాడు?

 


దర్శకుడు బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ తో కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అతను ఉప్పెన సినిమా సక్సెస్ అయిన తర్వాత తన రెండవ కథను జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించాడు. తారక్ కూడా ఆ కథపై పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. పెద్ది అనే టైటిల్ కూడా బుచ్చిబాబు ముందుగానే రిజిస్టర్ కూడా చేయించాడు. ఇక కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత రామ్ చరణ్ లిస్టు లోకి రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.


అయితే రామ్ చరణ్ తో చేస్తున్న కథ వేరేది అనే విధంగా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ పెద్ది టైటిల్ చర్చలోకి రాగానే అది ఇది ఒకటే అని క్లారిటీ వచ్చేసింది. అయితే అయితే జూనియర్ ఎన్టీఆర్ పెద్ది స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేయడానికి గల కారణాలు అంతగా బయటకి రాలేదు. ఇక బుచ్చిబాబు సన్నిహితుల సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దేవర ప్రాజెక్టు చర్చల్లోకి రాగానే బుచ్చిబాబును కొంతకాలం ఆగాలి అనే సూచనలు ఇచ్చాడట. అంతేకాకుండా కథలో కొన్ని కీలకమైన పాయింట్స్ కూడా మార్చాలి అని ఎన్టీఆర్ కోరినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ రెండు మాటలపై బుచ్చిబాబు ఆలోచిస్తున్న తరుణంలోనే టైమ్ వేస్ట్ చేసుకోవద్దని గురువు సుకుమార్ ఇచ్చిన సలహాతో రామ్ చరణ్ వద్దకు బుచ్చిబాబు వెళ్లాడట. ఇక ఎన్టీఆర్ కూడా ఆ విషయంలో బుచ్చిబాబుకు సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

Post a Comment

Previous Post Next Post