అల్లు అర్జున్ కాంబో.. ఆ డైరెక్టర్ కు 60 కోట్లు?

 


అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత ఏ దర్శకుడుతో సినిమా స్టార్ట్ చేస్తాడు అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మొదట త్రివిక్రమ్ తో వెంటనే ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. కానీ మళ్ళీ ఎందుకు బన్నీ ఆలోచన మారింది. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్టు మొదలవడానికి ఇంకా సమయం పడుతుంది. మధ్యలో సందీప్ స్పిరిట్ తో పాటు యానిమల్ సెకండ్ పార్ట్ కూడా ఫినిష్ చేయాల్సి ఉంది.


అయితే ఈ క్రమంలో సౌత్ టాప్ డైరెక్టర్ లో ఒకరైన అట్లీతో సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సన్ పిక్చర్ ఇప్పటికే  అతనితో మాట్లాడి బన్నీ కోసం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు మెయిన్ స్టోరీ అయితే సిద్ధమైంది. ఇక మరొక సెట్టింగ్ లో ఫైనల్ స్క్రిప్ట్ ఓకే చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం దర్శకుడు దాదాపు 60 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తో పాటు బిజినెస్ లో షేర్ కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా అట్లీ ఆ స్థాయిలో అడగడంలో తప్పులేదు. ఎందుకంటే జవాన్ సినిమా దాదాపు 1000 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కాబట్టి ఇప్పుడు అతనికి అడిగినంత ఇవ్వడానికి చాలా మంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఇక సన్ పిక్చర్స్ అతనే కండిషన్ కు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post