తారక్.. ఓ వైపు ఆదాయం - మరోవైపు క్రేజ్!

 


బాక్సాఫీస్ వద్ద “RRR” తో సూపర్ క్రేజ్ అందుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ దేవర సినిమాతో సిద్ధమవుతున్నాడు. అలాగే  వార్2 పై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మరో మరొక స్పై థ్రిల్లర్‌లో కూడా సోలో హీరోగా కనిపించనున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇవన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ కి తగ్గ కాంబినేషన్ సినిమాలే.


ఇక ఎన్టీఆర్ తన కెరీర్‌లో చాలా యాడ్స్ ఎండార్స్‌మెంట్‌లు చేసినప్పటికీ, ఈ మధ్య మాత్రం మరికొంత స్పీడ్ పెంచాడు. ప్రముఖ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతున్న తారక్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నందున, వీలైనన్ని ఎక్కువ బ్రాండ్‌లను పట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు, తద్వారా దేశవ్యాప్తంగా అతని క్రేజ్ కూడా పెరుగుతుంది. చాలా వరకు లోకల్ బ్రాండ్స్ కు సంబంధించిన ఆఫర్స్ ఎన్ని వస్తున్నా చేయడం లేదట.

నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ లకు సంబంధించి యాడ్స్ కోసం ప్రత్యేకంగా తారక్ ముంబైకు కూడా వెళ్ళాడు. అక్కడ అగ్రశ్రేణి బ్రాండ్-ఎండార్స్‌మెంట్ ఫెచింగ్ ఏజెన్సీలను కలిసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దేశంలోని మరి కొన్ని పెద్ద బ్రాండ్‌ల కోసం కూడా తారక్ వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తారక్ యాడ్స్ చేయడం కోసం మంచి ప్లాన్ వేశాడు. ఒకవైపు భారీ ఆదాయంతో పాటు నేషనల్ వైడ్ గా క్రేజ్ కూడా పెరుగుతుంది.

Post a Comment

Previous Post Next Post