పుష్ప 2.. ఈ లెక్కతో 1000 కోట్లు పక్కా

 


అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల మార్కెట్ ను అందుకోవాలి అని ఒక బలమైన టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నాడు. సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ అందుకు తగ్గట్టుగానే సినిమాను గ్రాండ్ గా తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు ప్రతి ఇండస్ట్రీలో కూడా మంచి బజ్ అయితే ఏర్పడింది. నాన్ థియేట్రికల్ గా + థియేట్రికల్ గా ఈ సినిమా రెండువైపుల నుంచి దాదాపు 700 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందని టాక్.


ఇక బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం క్లిక్కయినా కూడా టోటల్ లెక్క 1000 కోట్లను అందుకునే ఛాన్స్ ఉంది. పుష్ప 2 కూడా అన్ని వైపులా వెయ్యి కోట్ల వ్యాపారం చేసిన సినిమాగా నిలుస్తుంది. ఇక ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సోలో హీరోగా ప్రభాస్ మాత్రమే ఈ రికార్డును అందుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక సౌత్ ఇండస్ట్రీలో చూసుకుంటే KGF 2 సినిమాతో యశ్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఇప్పుడు 1000 కోట్ల రికార్డును అందుకున్న సోలో హీరోగా అల్లు అర్జున్ నిలిచే అవకాశం ఉంది. మరి ఆ టార్గెట్ ను ఎంత వేగంగా అందుకుంటాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post