సాయి పల్లవి రామాయణ.. టైమ్ దగ్గర పడింది!

 


దంగల్ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు నితీష్ తివారి కూడా ఒక రామాయణం ప్రాజెక్టును తెరపైకి తీసుకురాబోతున్నట్లుగా చాలా రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ ఈ సినిమా మాత్రం తప్పకుండా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది అని బాలీవుడ్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా సాయిపల్లవిని సీత పాత్రకు ఫిక్స్ చేశారు అని రణబీర్ కపూర్ రాముడిగా కనిపించబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.


అంతేకాకుండా రావణుడి పాత్రలో కేజిఎఫ్ స్టార్ యశ్ నటిస్తాడు అని కూడా అంటున్నారు. ఇక ఈ కాంబినేషన్ పై టాక్ ఎంత వైరల్ అవుతున్న కూడా ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. అసలు నిజంగానే ఈ సినిమా ఉంటుందా లేదా అని డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే ఫైనల్ గా మాత్రం శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17వ తేదీన ఈ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆరోజే అధికారికంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేయనున్నట్లు మరో టాక్ గట్టిగానే వైరల్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post