రామ్ చరణ్ కు అంబానీ డబ్బులిచ్చాడా?

 


అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు రామ్ చరణ్, ఉపాసన ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన సంగతి తెలిసిందే.  అక్కడ జరిగిన వేడుకల్లో దంపతులు చురుగ్గా పాల్గొన్నారు. అయితే ఇలాంటి వేడుకల్లో పాల్గొనడానికి సాధారణంగా సినిమా స్టార్స్ డబ్బులు తీసుకుంటారు అని స్టేజీలపై డాన్సులు చేయడానికి కూడా భారీ మొత్తంలో అందుకుంటారని అని చాలా రకాల కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. నిజానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి ట్రెడిషనల్ అయితే ఎప్పటినుంచో ఉంది. అక్కడ పెద్ద పెద్ద స్టార్స్ కూడా డబ్బులు తీసుకునే ఫంక్షన్స్ కు వస్తూ ఉంటారు.


అయితే రామ్ చరణ్ కూడా అదే తరహాలో డబ్బులు తీసుకుని ఉంటాడు అని చాలా రకాల పుకార్లు వైరల్ అయ్యాయి కానీ ఇందులో మాత్రం ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఎందుకంటే టాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా ఏ పెద్ద హీరోలు కూడా ఈ తరహాలో డబ్బులు సంపాదించాలని అనుకోరు. ముఖ్యంగా మన స్టార్స్ వీటికి చాలా దూరంగా ఉంటారు. అలాగే రామ్ చరణ్ కూడా సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్ తరహాలో అయితే వేదికపై హడావుడి చేయలేదు.

కేవలం వారి ముగ్గురితో రెండు స్టెప్పులు వేసి సైడ్ అయ్యాడు. కానీ ముగ్గురు ఖన్స్ మాత్రం గంటల తరబడి అంబానీ ఫ్యామిలీ వెనకాలే ఉన్నారు.. స్టేజ్ పైనే ఎంటర్టైన్ చేశారు. కాబట్టి చరణ్ డబ్బులు తీసుకున్నట్లు వస్తున్న వార్తల్లో అసలు నిజం లేదని చెప్పవచ్చు. అలాగే  అంబానీ ఫ్యామిలీకి కామినేని వారికి మంచి స్నేహ సంబంధం ఉంది. ఆ రూట్లో నుంచి కూడా ఉపాసనతో పాటు రామ్ చరణ్ కూడా వేడుకలో పాల్గొని ఉండవచ్చని టాక్.

Post a Comment

Previous Post Next Post