టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్


 
టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడిప్పుడే మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పొరుగు భాషల నటీనటులు కూడా తెలుగు దర్శకులు, నిర్మాతలతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక లేటెస్ట్ బజ్ ఏమిటంటే.. దుల్కర్ సల్మాన్ - అడివి శేష్ మల్టీస్టారర్‌ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.  పరశురామ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన యువకుడు ఈ సినిమాతో డైరెక్టర్ గా మారబోతున్నట్లు సమాచారం.


అడివి శేష్ దుల్కర్ సల్మాన్ ఇద్దరూ కూడా డిఫరెంట్ కంటెంట్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రయోగాత్మకమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటున్నారు. ఇక ఆ యువ దర్శకుడికి ఈ ఇద్దరు నటీనటులు తమ ఆమోదం తెలిపితే సౌత్ సినిమాలో ఇది ఇంట్రెస్టింగ్ కాంబో అవుతుంది. త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట. దుల్కర్‌కి సౌత్‌తో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అడివి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. దుల్కర్ సల్మాన్ ఇటీవల తేజ సజ్జ చిత్రంలో ఆసక్తికరమైన పాత్ర చేసేందుకు ఓకే చెప్పాడు. దానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ఇక మరోవైపు అడివి శేష్ షూటింగ్ చేస్తున్న గూఢాచారి 2 వచ్చే ఏడాది విడుదల కానుంది.

Post a Comment

Previous Post Next Post