నాగ చైతన్య.. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు!


అక్కినేని నాగచైతన్య బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అతని కెరీర్ లో కొన్ని మంచి సక్సెస్ లు ఉన్నప్పటికీ కూడా నాగచైతన్య కు సోలో మార్కెట్ క్రియేట్ చేసిన రేంజ్ లో అయితే సక్సెస్ రాలేదు. ప్రతి సినిమాకు కాంబినేషన్ లేదా ఇతర విషయాలు నాగచైతన్య బాగా కలిసి వస్తున్నాయి. అయితే నాగచైతన్య కేవలం తన పర్ఫామెన్స్ తో సినిమాను మరొక రేంజ్ కు తీసుకువెళ్లేలా ఒక సక్సెస్ అయితే చూడాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు రామ్ చరణ్ కు రంగస్థలం ఎలానో ఇప్పుడు చైతూ కు అలాంటి హిట్టు రావాలి.


ఇప్పుడు అతను చేతిలో ఉన్న ఏకైక ఆయుధం తండెల్ సినిమా మాత్రమే. ఈ సినిమా మత్స్యకారుల నేపథ్యంలో నిజ జీవితంలోనే కొన్ని సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. పాకిస్తాన్ సైనికుల చేతిలో బందీలుగా మరే కథాంశం కూడా ఇందులో ప్రధానంగా ఉండబోతోంది.  ఒక మత్స్యకారుడుగా ఆ తర్వాత దేశభక్తిని చూపించే యువకుడిగా నాగచైతన్య ఇందులో కనిపించబోతున్నాడు.

ఇందులో యాక్షన్ కూడా కాస్త గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు చందు మొండేటి ఇప్పటికే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు అందుకున్నాడు. కాబట్టి నాగచైతన్యకు ఇది ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. మరోవైపు సాయి పల్లవి హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉంది. ఇక అందరిని డామినేట్ చేసేలా నాగచైతన్య పెర్ఫార్మెన్స్ సినిమాలో క్లిక్ అవ్వాలి. అప్పుడే అతని భవిష్యత్తుకు కూడా అది ఉపయోగపడుతుంది. మరి తండెల్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post