విక్రమార్కుడు 2.. వితేజ ఎందుకు రిజెక్ట్ చేశాడు?

రాజమౌళి దర్శకత్వంలో 2006లో వచ్చిన విక్రమార్కుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రవితేజకు అప్పటివరకు ఉన్న ఒక ఇమేజ్ ను ఈ సినిమా మరొక రేంజ్ కు తీసుకువెళ్ళింది. విక్రమ్ సింగ్ రాథోడ్ అనే క్యారెక్టర్ మిగతా భాషల్లో కూడా రీమేక్ అయినప్పటికీ ఎవరు కూడా రవితేజ రేంజ్ లో అయితే న్యాయం చేయలేదు.


ఇక ఇప్పుడు అలాంటి కథకు సీక్వెల్ సిద్ధం చేశారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. సీక్వెల్ రైట్స్ ను నిర్మాత రాధ మోహన్ దక్కించుకున్నాడు. రవితేజకు కూడా కథను వినిపించడం జరిగింది. అయితే రవితేజ మాత్రం కథ గురించి పెద్దగా చర్చలు జరపకుండానే దాన్ని రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ విక్రమార్కుడు 2 సినిమా చేస్తే రాజమౌళితోనే చేస్తాను అని ఆ పాత్రను ఆయనకంటే పర్ఫెక్ట్ గా ఎవరు ఎలివేట్ చేయలేరు అనే ఆలోచనతో రవితేజ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాజమౌళి ఆలోచన తీరు పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంది. ఇప్పుడు అతను విక్రమార్కుడు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే స్థాయిలో లేరు. ఇక ఇదే సమయంలో రాధామోహన్ విక్రమార్కుడు సీక్వెల్ ను మరో హీరోతో చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post