అల్లు అర్జున్.. రెండు సినిమాలు వచ్చే ఏడాదిలోనే..

 


అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత ఎవరితో మళ్ళీ తన తదుపరి సినిమాను స్టార్ట్ చేస్తాడు అనే విషయంలో ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు. గత కొన్ని రోజులుగా అట్లీ దర్శకత్వంలోనే నెక్స్ట్ సినిమా చేస్తాడు అని బలమైన టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఇక రీసెంట్ గా బన్నీ పుట్టినరోజు సందర్భంగా హారిక హాసిని సంస్థ నుంచి కూడా విషెస్ రావడంతో త్రివిక్రమ్ ప్రాజెక్టు కూడా ఉంటుంది అని మరో క్లారిటీ వచ్చేసింది.


అయితే ఈ ఇద్దరి ప్రాజెక్టులలో ముందుగా అట్లీ తో కొత్త ప్రాజెక్టును స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఒక రెండు మూడు నెలల తర్వాత అట్లీ సినిమా చేస్తూనే త్రివిక్రమ్ ప్రాజెక్టును కూడా మొదలుపెట్టే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే ఉండబోతోంది. దర్శకుడు త్రివిక్రమ్ హిస్టారికల్ నేపథ్యంతో ఈసారి బన్నీ కోసం సరికొత్త కథను చేసినట్లు సమాచారం.

అలాగే అట్లీ త్రివిక్రమ్ సినిమాలు రెండు కూడా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకి రావచ్చు. బన్నీ కోసం బోయపాటి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రాజెక్టుపై క్లారిటీ రావడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు లిస్టులో సందీప్ రెడ్డి వంగా కూడా ఉన్నాడు. అతను ప్రభాస్ స్పిరిట్, యానిమల్ 2 సినిమాల తర్వాతనే అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post