అంటే సలార్ 2.. వచ్చేది అప్పుడే..

 


ప్రభాస్ సలార్ 2 సెకండ్ పార్ట్ ను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొంత షూటింగ్ కూడా పూర్తయింది. ఇక పూర్తిస్థాయిలో సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ కూడా ఫినిష్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. అసలైతే ఈపాటికే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కావాల్సింది. కానీ ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కాస్త ఆలస్యంగా మొదలు పెడుతున్నాడు.


అయితే రీసెంట్ గా ఇందులో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సినిమా విడుదలపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు అంటూ ఆ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ లో ల్ కూడా తాను పాల్గొనబోతున్నాను అని అన్నారు. అయితే పక్క ప్రణాళికతో సినిమాను 2025 లోనే విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఇక డేట్ విషయంలో మాత్రం పూర్తి నిర్ణయం దర్శక నిర్మాతలదే అన్నట్లు వివరణ ఇచ్చారు. లేటెస్ట్ గా అందుతున్న మరొక లీక్ ప్రకారం అయితే 2025 చివరలోనే రావచ్చు అని తెలుస్తోంది. అంటే ఫస్ట్ పార్ట్ మాదిరిగానే డిసెంబర్లోనే సలార్ 2 సినిమాను విడుదల చేస్తారని టాక్ అయితే వినిపిస్తోంది.

Post a Comment

Previous Post Next Post