చైతూ.. హిట్టిచ్చిన డైరెక్టర్ ను రిజెక్ట్ చేశాడుగా..

 


నాగచైతన్య తండేల్ కంటే ముందు పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి. కానీ ఆ దర్శకుడు మహేష్ తో ఛాన్స్ అందుకొని సర్కారు వారి పాటను లైన్ లో పెట్టాడు. ఆ సినిమా తరువాత తప్పకుండా మీతో సినిమా చేస్తానని చైతూ కి మాట కూడా ఇచ్చాడు. ఇక మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో గాని పరశురామ్ దిల్ రాజు కాంపౌండ్ లో చేరి విజయ్ తో ఫ్యామిలీ స్టార్ సినిమా చేశాడు.


అనంతరం చైతూ ఒక ఇంటర్వ్యూలో లైఫ్ లో మళ్ళీ ఆ డైరెక్టర్ తో సినిమా చేయనని అనేశాడు. ఒక విధంగా పరశురామ్ మాట మార్చడాని అందరికి అర్థమయ్యింది. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండతో వర్క్ చేసిన మరో డైరెక్టర్ తో నాగచైతన్య సినిమా చేయాల్సి ఉండగా అది కూడా క్యాన్సిల్ అయ్యింది. మజిలీ లాంటి హిట్టిచ్చిన శివ నిర్వాణ ఇటీవల విజయ్ తో ఖుషి సినిమా చేశాడు.

అయితే ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఇక నాగచైతన్యతో వెంటనే షైన్ స్క్రీన్ లో శివ మరో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ కథ విషయంలో నాగచైతన్య అంతా సంతృప్తి చెందకపోవడంతో దాన్ని రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా ప్రస్తుతం శివ మరో హీరో కోసం సెర్చింగ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ విధంగా విజయ్ దేవరకొండ తో వర్క్ చేసిన దర్శకులు ఊహించిన విధంగా నాగచైతన్యతో సినిమా మిస్ చేసుకోవడం విశేషం.

Post a Comment

Previous Post Next Post