గేమ్ ఛేంజర్ లీక్స్.. మరో జయం మనదేరా?

 


శంకర్ ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు అంటే ఎక్కడ కూడా చిన్న ఫోటో లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అయితే గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం ఆయన ఎంత సీరియస్ గా ఉన్నా కూడా జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతోంది. ఇప్పటికే చాలాసార్లు సినిమా లొకేషన్స్ లోనే వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిర్మాణ సంస్థ దిల్ రాజు టీమ్ కూడా ఈ విషయంపై సీరియస్ గానే స్పందించినప్పటికీ మళ్లీ ఎప్పటిలానే లీక్స్ పరంపర కొనసాగుతోంది.


ఇక రీసెంట్ గా మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే ఆ వీడియో చూసిన దాన్నిబట్టి ఫ్లాష్ బ్యాక్ లో సీనియర్ రామ్ చరణ్ ఒక తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పొలిటికల్ లీడర్ గా నిలబెట్టే విధానం... ఇక ఆ తర్వాత తన వారసుడిని చూపించే విధానం.. తండ్రి మరణం తరువాత అతని గొప్పతనం హీరో తెలుసుకోవడం.. ఇలా కొన్ని అంశాలు జయం మనదేరా సినిమా తరహాలో ఉంటాయని గాసిప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. నిజానికి శంకర్ ఏ సినిమా నుంచి కూడా కాపీ కొట్టడు అని అందరికీ తెలిసిందే. కానీ స్ఫూర్తిగా తీసుకుని తనదైన శైలిలో సన్నివేశాలను హైలెట్ చేస్తూ ఉంటాడు. ఇక గేమ్ ఛేంజర్ కథను కార్తిక్ సుబ్బరాజు అందించాడు. మరి వస్తున్న గాసిప్స్ ప్రకారం గేమ్ ఛేంజర్ కథకు జయం మనదేరా స్టోరీకి ఏమైనా లింక్ ఉంటుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

Post a Comment

Previous Post Next Post