చెత్త కంపులో 10 గంటల పాటు స్టార్ హీరో

 


శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ చేస్తున్న కుబేర సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. నాగార్జున కూడా ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ సగం వరకు పూర్తయింది. అయితే ఈ సినిమాలో ఎన్నో సామాజిక అంశాలను టచ్ చేస్తున్న శేఖర్ కమ్ముల ప్రతి సన్నివేశం కూడా చాలా రియలిస్టిక్ గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.


అతను ఏ స్థాయిలో సన్నివేశాలను షూట్ చేస్తున్నాడు అంటే దాదాపు పది గంటల పాటు హీరోను చెత్త కంపులోనే నిలబెడుతున్నాడట. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు రియాలిటీకి దగ్గరగా ఉండాలి అని శేఖర్ కమ్ముల హీరో ధనుష్ ను ముంబైలోనే ఒక డంప్ యార్డులో మాస్క్ లేకుండా నిలబెట్టి కొన్ని సన్నివేశాలను షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక హీరో ధనుష్ కూడా డైరెక్టర్ ఊహలకు తగ్గట్టుగా ఎంతో ఓపికతో ఆ మురికి కంపులోనే యాక్టింగ్ చేసినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మరి ఇంతలా హార్డ్ వర్క్ చేస్తున్నా శేఖర్ కమ్ముల ధనుష్ లకు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని ఇస్తుందో చూడాలి. 

Post a Comment

Previous Post Next Post